కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వారందరికీ..;

Update: 2023-02-15 07:53 GMT
RTC bus hits lorry

RTC bus hits lorry

  • whatsapp icon

జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొని కండక్టర్ మృతి చెందగా.. ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వారందరికీ చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని, కండక్టర్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపారు.

మృతుడిని కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లి కు చెందిన సత్తయ్యగా గుర్తించారు. జగిత్యాల నుంచి వరంగల్‌ వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్ కాకుండా 8 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఈరోజు సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన ఉన్న నేపథ్యంలో.. ఈ ప్రమాదం జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.


Tags:    

Similar News