ఎన్డీఏ అభ్యర్థి ఎవరంటే?
రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార బీజేపీ తన తన అభ్యర్థిని నేడు ప్రకటించే అవకాశముంది.
రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార బీజేపీ తన తన అభ్యర్థిని నేడు ప్రకటించే అవకాశముంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. ఈ నెల 29వ తేదీన నామినేషన్లకు తుదిగడువు. దీంతో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ సమావేశం ఈరోజు జరగనుంది. ఈ సమావేశంలో ఎన్టీఏ తరుపున రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారా? అన్న ఉత్కంఠ ఇటు విపక్ష పార్టీల్లోనూ నెలకొంది.
మోదీ, షాల....
రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. కాగా రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కోసం బీజేపీ జేపీ నడ్డా, రాజ్‌నాధ్ సింగ్ లతో కూడిన ఒక కమిటీ అందరి అభిప్రాయాలను సేకరించింది. ఈరోజు సాయంత్రానికి ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థి పై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. ప్రధాని మోదీ, అమిత్ షాలు ఇప్పటికే దీనిపై ఒక అభిప్రాయానికి వచ్చారని తెలిసింది. ఇక పేరును అధికారికంగా ప్రకటించడమే తరువాయి.