ఊహించని విధంగా పతనమైన రూపాయి
విదేశీ నిధుల తరలింపు మరియు దేశీయ ఈక్విటీలలో నష్టాల కారణంగా బుధవారం US డాలర్‌తో రూపాయి 27 పైసలు క్షీణించి 78.40 (తాత్కాలిక) వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది.
విదేశీ నిధుల తరలింపు మరియు దేశీయ ఈక్విటీలలో నష్టాల కారణంగా బుధవారం US డాలర్‌తో రూపాయి 27 పైసలు క్షీణించి 78.40 (తాత్కాలిక) వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. ఓవర్సీస్‌లో బలమైన గ్రీన్‌బ్యాక్ కూడా రూపాయి సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు తగ్గుముఖం పట్టడం రూపాయి నష్టాన్ని పరిమితం చేసిందని వారు తెలిపారు. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి పడిపోయింది. బుధవారం ఉదయం ఒక డాలర్ కు రూ.78.13 పైసలతో ఫారిన్ ఎక్స్ఛేంజీ మార్కెట్ ప్రారంభం కాగా.. చివరికి రూ.78.40 పైసల వద్ద ముగిసింది. విదేశీ పెట్టుబడిదారులు దేశం నుంచి భారీ స్థాయిలో సొమ్మును వెనక్కి తీసుకుంటుండటంతో డాలర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగిందని, అదే రూపాయి పతనానికి కారణమైందని ఆర్థిక నిపుణులు తెలిపారు.