ఓ వైపు సంక్షోభం.. మరో వైపు ముఖ్యమంత్రి, గవర్నర్ కు కరోనా పాజిటివ్
దీంతో ఉద్దవ్ నేతృత్వంలోని మహా వికాశ్ అవధి కూటమి మైనార్టీలో పడింది. సంక్షోభంపై ఉద్దవ్‌తో చర్చించేందుకు కాంగ్రెస్ నేత కమల్‌నాథ్
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకు కరోనా వైరస్ సంక్రమించింది. శివసేనకు చెందిన మంత్రి ఏక్‌నాథ్ షిండే సుమారు 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటుకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్దవ్ నేతృత్వంలోని మహా వికాశ్ అవధి కూటమి మైనార్టీలో పడింది. సంక్షోభంపై ఉద్దవ్‌తో చర్చించేందుకు కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ ప్రయత్నించగా.. ఉద్దవ్ కోవిడ్ పాజిటివ్ అని, దాని వల్లే ఆయన్ను కలవలేకపోయినట్లు కమల్‌నాథ్ తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశియారికి కూడా కరోనా వైరస్ సంక్రమించింది. రిలయన్స్ ట్రస్ట్ హాస్పిటల్‌లో ఆయన చేరారు.
షిండే ఎప్పటి నుంచో శివ సైనికుడని, అతడు తమతోనే ఎప్పటికీ ఉంటాడని, చర్చలు జరుగుతున్నాయని ప్రకటించిన సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు విధాన సభ రద్దు దిశగా కొనసాగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలో సంకీర్ణ ఎంవీఏ సర్కారు విధాన సభ రద్దుకు సిఫారసు చేస్తే దాన్ని గవర్నర్ ఆమోదించాల్సిన అవసరం లేదు. గవర్నర్ కు ఆమోదం అయితే సభను రద్దు చేయవచ్చు. అప్పుడు తాజా ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు బీజేపీ, ఎంఎన్ఎస్, ఇతర ప్రత్యర్థి చిన్న పార్టీలు ఒక కూటమిగా.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఒక కూటమిగా ప్రజల ముందుకు వెళ్లొచ్చు. ఒకవేళ సభ రద్దు సిఫారసును గవర్నర్ తోసిపుచ్చితే.. అప్పుడు సభలో మెజారిటీ నిరూపించుకోవాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరతారు. విఫలమైతే అప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో లేఖ సమర్పించిన వారిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారు. అప్పుడు శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు.
ఏక్‌నాథ్ షిండేకు మద్దతు తెలుపుతూ పత్రాలపై శివసేనకు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. అధికారం మారిన తర్వాతే రాష్ట్రానికి తిరిగి వస్తామని వారు అంటున్నారు. తమలో ఎవరినీ బలవంతంగా అసోంకు తీసుకురాలేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి అధికారంలో ఉండడం ఇష్టం లేదని చెప్పారు. శివ సైనికులు, స్వతంత్ర ఎమ్మెల్యేలు అధికారంలో మార్పును కోరుకుంటున్నారని వారు అన్నారు.