ఈ శుక్రవారం స్కూల్స్, కాలేజీలకు బంద్
టౌన్ హాల్ నుంచి ఫ్రీడం పార్క్ వరకు భారీ నిరసన ప్రదర్శన ఉండనుంది. ఇందులో అన్ని వర్గాల ప్రజలు
శుక్రవారం నాడు.. సెప్టెంబర్ 29న కర్ణాటక బంద్‌కు పిలుపును ఇచ్చారు. బెంగళూరు జిల్లా యంత్రాంగం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. కర్ణాటక రక్షణ వేదిక, కన్నడ చలవలి (వాతల్ పక్ష), వివిధ రైతు సంఘాలతో ఉన్న 'కన్నడ ఒక్కట' బృందం.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు బంద్‌కు పిలుపునిచ్చింది. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయండంపై కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
బంద్ కారణంగా రాష్ట్రంలో రవాణాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌ల నుండి మాత్రమే బస్సులు ప్రయాణికులను తీసుకువెళ్లనున్నాయి. బెంగళూరు నగరంలోని టౌన్ హాల్ నుంచి ఫ్రీడం పార్క్ వరకు భారీ నిరసన ప్రదర్శన ఉండనుంది. ఇందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. కర్ణాటకలోని హోటళ్లు, ఆటోరిక్షాలు, హెల్ రైడర్స్ అసోసియేషన్‌లతో పాటు ప్రతిపక్ష బీజేపీ, జేడీ(ఎస్) బంద్‌కు తమ మద్దతును ప్రకటించాయి. ఆటోరిక్షా డ్రైవర్స్ యూనియన్, ఓలా ఉబర్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ (OUDOA) బంద్‌కు మద్దతు ఇచ్చాయి. బంద్‌కు తాము నైతిక మద్దతు ఇస్తున్నామని కర్ణాటక స్టేట్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ మీడియాకి తెలిపారు.