రేపే పాఠశాలలు పునః ప్రారంభం
రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ పాఠశాలలను తెరిచే ప్రణాళికను ప్రకటించారు. జిల్లా కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో
మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో రేపట్నుంచి (జనవరి 24) పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. అక్కడ కోవిడ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నప్పటికీ.. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటన చేశారు. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ పాఠశాలలను తెరిచే ప్రణాళికను ప్రకటించారు. జిల్లా కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో కోవిడ్ కేసులను పరిగణలోకి తీసుకుని, స్కూళ్ల పునః ప్రారంభంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Also Read : కరోనా ఉద్ధృతి - కేరళలో సండే సంపూర్ణ లాక్ డౌన్
అలాగే ముంబైలో పాఠశాలలు కూడా రేపట్నుంచే ప్రారంభించనున్నట్లు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆఫ్‌లైన్ తరగతులకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా వారి తల్లిదండ్రుల నుండి 'సమ్మతి లేఖ'ని కలిగి ఉండాలి. సీఎం విడుదల చేసిన జాబితా ప్రకారం ముంబై, నాసిక్, థానే, నందుర్బార్, జలగావ్ లలో జనవరి 24వ తేదీ నుంచి 1 నుండి 12వ తరగతుల వరకూ స్కూళ్లు తిరిగి తెరచుకోనున్నాయి. ఇదిలా ఉండగా.. పూణే, అహ్మద్ నగర్లలో స్కూళ్ల పునః ప్రారంభంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.