పూంచ్ ఉగ్రదాడిలో జవాన్లపై కాల్పులు
పూంచ్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిపై భద్రతా దళాలు స్పందించాయి. ఆయిల్ ట్యాంకర్ పేలడంతోనే ప్రాణ నష్ట ఎక్కువ జరిగిందన్నాయి
పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిపై భద్రతా దళాలు స్పందించాయి. ఆయిల్ ట్యాంకర్ పేలడంతోనే ప్రాణ నష్ట ఎక్కువ జరిగిందని తెలిపాయి. ఇటీవల పూంచ్ జిల్లాలో రెండు గ్రూపులకు చెందిన ఏడుగురు ఉగ్రవాదులు దాడి చేయడంతో ఐదుగురు భారత జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిన విషయమూ విదితమే. ఉగ్రవాదులు స్టిక్కీ బాంబులు ఉపయోగించినట్లు విచారణలో వెల్లడయింది.
ఇంటలిజెన్స్ బ్యూరో...
ఈ మేరకు భద్రతాదళాలు హోంశాఖ, ఎన్ఐఏకు ఇంటిలిజెన్స్ బ్యూరో నివేదికలో వెల్లడించింది. ద దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో స్టిక్కీ బాంబులను వాహనాలకు జోడించి రిమోట్ లేదా టైమర్‌ల ద్వారా పేల్చవచ్చని పేర్కంది. సమీపం నుంచే ఉగ్రవాదులు 36 రౌండ్ల కాల్పులు జవాన్ల మీద కాల్చారని చెప్పారు. ఇప్పటికీ దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి.