ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస సెలవులు !
ఏప్రిల్ 9,10 తేదీలు బ్యాంకులకు వారాంతపు సెలవులు. ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి,
హైదరాబాద్ : ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ.. నూతన ఆర్థిక సంవత్సరం తొలిరోజు బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 1వ తేదీ మొదలు.. మొత్తం 9 రోజులు ఏప్రిల్ లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఏప్రిల్ 2వ తేదీ శనివారం అయినప్పటికీ.. ఉగాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇక 3వ తేదీ ఆదివారం వారాంతపు సెలవు మామూలే.
ఏప్రిల్ 9,10 తేదీలు బ్యాంకులకు వారాంతపు సెలవులు. ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి, మహావీర్ జయంతి, తమిళ నూతన సంవత్సరాది, వివిధ ప్రాంతాల్లో చైరావోబా, బిజు ఫెస్టివల్, బొహాగ్ బిహూ ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో బ్యాంకులు పని చేయవు. 15వ తేదీన గుడ్ ఫ్రైడేతోపాటు బెంగాల్ నూతన సంవత్సరాది, హిమాచల్ ప్రదేశ్ దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. 17వ తేదీ ఆదివారం సెలవు. ఏప్రిల్ 23వ తేదీ నాలుగో శనివారం, 24వ తేదీ ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు పైన పేర్కొన్న తేదీల్లో పనిచేయవు.