ఎయిర్‌ ఇండియాకు ఊహించని షాక్.. హైదరాబాద్‌ సెంటర్‌పై ఆంక్షలు

టాటా కంపెనీ యాజమాన్యంలోని ఎయిర్‌ ఇండియాకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) ఊహించని షాక్‌ ఇచ్చింది

Update: 2023-08-31 03:05 GMT

టాటా కంపెనీ యాజమాన్యంలోని ఎయిర్‌ ఇండియాకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) ఊహించని షాక్‌ ఇచ్చింది. హైదరాబాద్‌లోని సిమ్యులేటర్‌ ట్రైనింగ్‌ ఫెసిలిటీ సెంటర్‌పై నిషేధం విధించింది. ముంబయి సిమ్యులేటర్‌ సెంటర్‌పై చర్యలు తీసుకున్న మూడు రోజుల్లోనే హైదరాబాద్‌ సెంటర్‌పై ఆంక్షలు విధించింది. ఈ కేంద్రంలో పైలెట్లకు ఇచ్చే శిక్షణలో కొన్ని లోపాలున్నట్టు తనిఖీల్లో తేలింది. ఆయా సిమ్యులేటర్‌ ఫెసిలిటీ సెంటర్లలో శిక్షణా కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించింది. ఎయిర్‌ ఇండియా ముంబయిలో కేంద్రంలో బోయింగ్‌ 777, బీ787 విమాన పైలెట్లకు, హైదరాబాద్‌లో ఎయిర్‌బస్‌ ఏ-320 విమాన పైలెట్లకు శిక్షణ ఇస్తోంది. రెండు కీలకమైన ఫిసిలిటీ సెంటర్లలో కార్యకలాపాలు నిలిపివేయడంతో ఎయిర్‌ ఇండియాకు శిక్షణకు సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ఎయిర్‌ ఇండియా స్పందించాల్సి ఉంది. తనిఖీలకు సంబంధించి డీజీసీఏ ఇచ్చిన సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని దిద్దుబాటు చర్యలు చేపడుతామని ఎయిర్‌ ఇండియా సీనియర్‌ అధికారి తెలిపారు. ఎయిర్‌ ఇండియాలో తనిఖీలకు సంబంధించి డీజీసీఏ ఇప్పటి వరకు స్పందించలేదు.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కేవలం మూడు రోజుల వ్యవధిలో తీసుకున్న రెండు నిర్ణయాలు ఎయిర్ ఇండియాకు పలు సవాళ్లను కలిగిస్తాయి. ప్రస్తుతం క్యారియర్ నారో బాడీ, వైడ్ బాడీ పైలట్‌లకు స్వంత శిక్షణా కేంద్రాలలో శిక్షణ ఇవ్వలేదు. "A320 పైలట్‌ల కోసం ఎయిర్ ఇండియా సదుపాయంలోని సిమ్యులేటర్ శిక్షణా కార్యకలాపాలను DGCA ఇప్పుడు తాత్కాలికంగా నిలిపివేసింది, అలాగే తనిఖీ సమయంలో కొన్ని లోపాలు ఉన్నాయి" అని ఒకరు బుధవారం ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు తెలిపారు. ఇటీవల ఇద్దరు సభ్యులు డీజీసీఏ బృందం ఎయిర్‌లైన్‌ అంతర్గత భద్రతా ఆడిట్‌ రిపోర్టులో లోపాలను గుర్తించింది. టాటా కంపెనీ చేతుల్లోకి ఎయిర్ ఇండియా చేరాక.. పెద్ద ఎత్తున మార్పులు జరుగుతూ ఉన్నాయి. 470 నారో బాడీ, వైడ్ బాడీ విమానాల కోసం ఎయిర్ ఇండియా ఆర్డర్లు చేసింది. ఎయిర్ ఇండియా తన కార్యకలాపాలను విస్తరిస్తూ ఉండడంతో వివిధ స్థాయిలలోని వ్యక్తులను కూడా తీసుకుంటోంది.


Tags:    

Similar News