ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

కరోనా బారినపడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు.

Update: 2022-06-12 10:31 GMT

కరోనా బారినపడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, ముందుజాగ్రత్తగా ఆసుపత్రిలో ఉంచారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా సోనియా గాంధీని ఆసుపత్రిలో అబ్జర్వేషన్ లో ఉంచారని ట్వీట్ చేశారు. సోనియా గాంధీ జూన్ 2 న కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ కారణంగా మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నుండి మరింత సమయం కోరారు కాంగ్రెస్ అధినేత్రి.

జూన్ 23న విచారణకు హాజరు కావాల్సిందిగా సోనియా గాంధీకి తాజాగా సమన్లు ​​జారీ చేసినట్లు ఏజెన్సీ అధికారులు తెలిపారు. 75 ఏళ్ల గాంధీని ముందుగా జూన్ 8న విచారణకు హాజరవ్వాలని కోరారు. ఈ కేసులో ఆమె కుమారుడు, పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని కూడా జూన్ 13న ఈడీ ప్రశ్నించేందుకు సమన్లు ​​పంపింది. జూన్ 2న విచారణకు ఏజెన్సీ రాహుల్ గాంధీని ముందుగా కోరింది, అయితే తాను దేశం వెలుపల ఉన్నందున కొత్త తేదీని ఇవ్వాలని కోరాడు. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జూన్ 13న హాజరు కావాలని ఫెడరల్ ఏజెన్సీ ఆ తర్వాత రాహుల్ గాంధీని కోరింది.


Tags:    

Similar News