‌Hemanth Soren : ఈడీ కస్టడీకి హేమంత్ సోరెన్

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఐదురోజుల ఈడీ కస్టడీకి ప్రత్యేక కోర్టు అనుమతించింది.

Update: 2024-02-02 11:02 GMT

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఐదురోజుల ఈడీ కస్టడీకి ప్రత్యేక కోర్టు అనుమతించింది. భూ ఆక్రమణలు, మనీ లాండరింగ్ కేసులో రెండు రోజుల క్రితం హేమంత్ సోరెన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఐదు రోజుల పాటు...
అయితే అరెస్ట్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు రాంచీలోని ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. తమకు పది రోజుల కస్టడీకి హేమంత్ సోరెన్ ను అప్పగిస్తూ ఆదేశాలను ఇవ్వాలని కోరింది. అయితే న్యాయస్థానం మాత్రం ఐదు రోజులు మాత్రమే కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News