ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. పెరుగుతున్న వత్తిడి
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో ప్రత్యేక హోదా మరోసారి ప్రత్యేక చర్చగా మారింది.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో ప్రత్యేక హోదా మరోసారి ప్రత్యేక చర్చగా మారింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక హోదా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాల్లో బడ్జెట్ తో పాటు వివిధ బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ సమావేశానికి మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా హాజయ్యారు. ఏపీలో దాడులపై వైసీపీ ప్రస్తావించింది. పార్లమెంటు సమావేశంలో దాడులపై చర్చించాలని పట్టుబట్టింది. మరో వైపు ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ బిజూ జనతా దళ్ నేతలు పట్టుబట్టారు.
అఖిలపక్ష సమావేశంలో...
అయితే ఈ సమావేశంలో ప్రత్యేక హోదా మరోసారి ప్రత్యేకతను సంతరించుకుంది. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆర్జేడీ, జేడీయూలు అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేశాయి. తమ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదాతో సాధ్యమని అవి డిమాండ్ చేశాయి. అదే సమయంలో వైసీపీ ఎంపీలు కూడా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. విభజన జరిగిన సమయంలో ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కోరారు. అయితే దీనిపై అధికార పక్షం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు ఆగస్టు 12వ తేదీ వరకూ జరగనున్నాయి.