భారత్ లో తగ్గుతున్న కరోనా
భారత్ లో కరోనా వ్యాప్తి తగ్గింది. రెండు రోజుల నుంచి కరోనా కేసులు తగ్గుతున్నాయి. 5,076 మందికి కరోనా వైరస్ బారిన పడ్డారు.
భారత్ లో కరోనా వ్యాప్తి తగ్గింది. రెండు రోజుల నుంచి కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఒక్కరోజులోనే 5,076 మందికి కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా కారణంగా పదకొండు మంది మరణించారు. ఒక్కరోజులోనే 7,227 మంది కరోనా చికిత్స పొంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.71 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసులు 0.11 శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
యాక్టివ్ కేసులు....
దేశంలో ఇప్పటి వరకూ 4, 39,19, 264 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. మరణాల రేటు ప్రస్తుతం 1.19 శాతంగా నమోదయింది. ప్రస్తుతం భారత్ లో 47,945 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకూ 214.95 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు అధికారులు తెలిపారు. కేసుల సంఖ్య తగ్గుతున్నా ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించాలని ఆరోగ్యశాఖ అధికారులు కోరుతున్నారు.