నేడు ఆకాశంలో విచిత్రం.. శ్రావణి పౌర్ణమి రోజున సూపర్ బ్లూమూన్

ఈరోజు ఆకాశంలో సూపర్ సీన్ ఆవిష్కృతం కానుంది. సూపర్ బ్లూమూన్ కనపడుతుంది

Update: 2024-08-19 04:19 GMT

ఈరోజు ఆకాశంలో సూపర్ సీన్ ఆవిష్కృతం కానుంది. సూపర్ బ్లూమూన్ కనపడుతుంది. ఈరోజు రాత్రి సూపర్ బ్లూమూన్ కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 150 ఏళ్ల తర్వాత ఈ సుందర దృశ్యం ఆవిష్కృతమవుతుంది. చంద్రుడు ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. అయితే ఇదే ఏడాది వరసగా మూడు సూపర్ మూన్ లు ఏర్పడబోతున్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. నేడు ఒకటి, సెప్టెంబరు 17న ఒకసారి, అక్టోబరు 17న మరోసారి ఈ సూపర్ మూన్ కనిపించనుంది.

ఈరోజు రాత్రికి...
మళ్లీ సూపర్ మూన్, బ్లూమూన్ కలయికతో 2037 సంవత్సరంలో ఏర్పడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. రాఖీ పౌర్ణమి రోజునే బ్లూమూన్ దర్శనమిస్తుండటం శుభసూచకంగా భావిస్తున్నారు. దీనిని చూసేందుకు రెండు కళ్లు చాలవని, ప్రతి ఒక్కరూ చూడాల్సిన దృశ్యమని అంటున్నారు. అందరూ రాత్రికి ఈ సూపర్ బ్లూమూన్ తో మధురానుభూతిని చెందవచ్చు.


Tags:    

Similar News