ఆ రాష్ట్రంలో సంపూర్ణ లాక్ డౌన్
వచ్చే ఆదివారం అంటే ఈనెల 23వ తేదీన సంపూర్ణ లాక్ డౌన్ ను కొనసాగించలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయించారు
వీకెండ్ లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా వైరస్ కొంత కంట్రోల్ అయింది. ఢిల్లీ ప్రభుత్వం వీకెండ్ లాక్ డౌన్ ను ఎత్తివేసింది. కర్ణాటకలో కూడా వీకెండ్ లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నారు. తమిళనాడులోనూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసులు దాదాపు 1.80 లక్షలున్నాయి. రోజుకు ఇరవై ఐదు వేల కేసులకు పైగానే నమోదవుతున్నాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఒక్క ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ విధించేలా నిర్ణయం తీసుకుంది.
వచ్చే ఆదివారం....
గత ఆదివారం లాక్ డౌన్ కొంత సక్సెస్ అయింది. దీంతో వచ్చే ఆదివారం అంటే ఈనెల 23వ తేదీన సంపూర్ణ లాక్ డౌన్ ను కొనసాగించలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయించారు. రాత్రి పది గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకూ లాక్ డౌన్ ను అమలులోకి తేనున్నారు. కరోనా కట్టడికి ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలని, అత్యవసర సేవలు మినహా ఏవీ అందుబాటులో ఉండవని చెప్పారు.