కమల్ హాసన్ పై తమిళ సర్కారు ఫైర్.. నోటీసులు జారీ
కమల్ హాసన్ పై తమిళ సర్కార్ ఫైర్ అయింది. కమల్ హాసన్ కు నోటీసులు జారీ చేసింది.
విశ్వనటుడు, రాజకీయ నాయకుడు అయిన కమల్ హాసన్ పై తమిళ సర్కార్ ఫైర్ అయింది. కమల్ హాసన్ కు నోటీసులు జారీ చేసింది. అసలేం జరిగిందంటే.. ఇటీవలే కమల్ హాసన్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి రాగానే కోవిడ్ పరీక్షలు చేయించుకోగా.. నవంబర్ 22వ తేదీన ఆయనకు పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా చెప్పారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. డిసెంబర్ 4వ తేదీన కమల్ కు కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ రావడంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు.
మూడు రోజులు రెస్ట్ తీసుకోమంటే?
కానీ.. ఎందుకైనా మంచిదని మరో మూడు రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. సాధారణంగా కరోనా నుంచి కోలుకున్న వారు ఎవరైనా .. నెగిటివ్ వచ్చాక మరో వారం రోజులైనా క్వారంటైన్ లో ఉండటం క్షేమమని వైద్యులు సూచిస్తున్నారు. కానీ కమల్ హాసన్ మాత్రం డిశ్చార్జ్ అయిన మరుసటి రోజునే తమిళ్ బిగ్ బాస్ సీజన్ 5 షో లో పాల్గొన్నారు. ఈ వీకెండ్ ఎపిసోడ్ లో ఆయన షో ను హోస్ట్ చేస్తున్నట్లు కనిపించడంతో తమిళ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
డిశ్చార్జ్ అయిన వెంటనే....
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మర్నాడే ఎందుకు షో లో పాల్గొన్నారో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. కాగా.. కమల్ అందుబాటులో లోని కొద్దిరోజులు సీనియర్ నటి రమ్యకృష్ణ ఆ షో ని హెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. అమెరికాలోని చికాగో లో కమల్ హాసన్ తన దుస్తుల లైన్ 'హౌస్ ఆఫ్ ఖద్దర్'ని ప్రారంభించేందుకు వెళ్లారు. అక్కడే కమల్ కు వైరస్ సోకి ఉంటుందని అందరూ భావించారు.