తారకరత్నకు మళ్లీ గుండెపోటు వచ్చే ప్రమాదం : బాలకృష్ణ
తారకరత్నకు మళ్లీ గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారన్నారు. ప్రస్తుతానికి స్టంట్ వేయడం కుదరలేదన్నారు.
రెండ్రోజుల క్రితం నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన నారాయణ హృదయాలయలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఆయన తాజా ఆరోగ్య పరిస్థితిపై నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని, వైద్యసేవలకు స్పందిస్తున్నారని తెలిపారు.
తారకరత్నకు మళ్లీ గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారన్నారు. ప్రస్తుతానికి స్టంట్ వేయడం కుదరలేదన్నారు. అతను త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థించాలని కోరారు. మరోవైపు తారకరత్నను చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కల్యాణ్‌రామ్ ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు. నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు తారకరత్నను చూసి.. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్నారు.
ఇదిలా ఉండగా.. తారకరత్నకు మెలేనా అనే ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు బెంగళూరులో నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపినట్లు సమాచారం. ఇది జీర్ణాశయాంతర రక్తస్తావానికి సంబంధించిన అరుదైన వ్యాధి. దీని వలన అన్నవాహిక, నోరు, పొట్ట, చిన్నపేగు మొదటి భాగం రక్తస్రావానికి గురవుతుంది.