పాఠశాలలో విషాదం.. లిఫ్ట్ లో ఇరుక్కుని టీచర్ మృతి
లిఫ్ట్ అలాగే 7వ ఫ్లోర్ కి వెళ్లేందుకు కదిలింది. లిఫ్ట్ డోర్ బయట శరీరం, లోపల కాలు ఉండిపోయి.. ఆ లిఫ్ట్, అది వెళ్లే..
స్కూల్ లిఫ్ట్ ఓ టీచర్ ప్రాణం తీసింది. ముంబైలో జరిగిన ఈ ఘటన.. స్థానికంగా విషాదాన్ని నింపింది. మలాడ్ ప్రాంతంలోని సెయింటి మేరీస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో జెనెల్ ఫెర్నాండెజ్ (26) టీచర్ గా విధులు నిర్వర్తిస్తోంది. శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో 6వ ఫ్లోర్ లో క్లాస్ ముగించుకున్న టీచర్.. సెకండ్ ఫ్లోర్ లో ఉన్న స్టాఫ్ రూమ్ కు వెళ్లేందుకు లిఫ్ట్ దగ్గర వేచిచూస్తోంది. లిఫ్ట్ ఆ ఫ్లోర్లో ఆగి.. డోర్స్ తెరుచుకున్నాక ఆమె లోపలికి వెళ్లేందుకు ఒక కాలు పెట్టగానే డోర్లు మూసుకుపోయాయి. దాంతో ఆమె రెండు డోర్ల మధ్యన చిక్కుకుపోయింది.
లిఫ్ట్ అలాగే 7వ ఫ్లోర్ కి వెళ్లేందుకు కదిలింది. లిఫ్ట్ డోర్ బయట శరీరం, లోపల కాలు ఉండిపోయి.. ఆ లిఫ్ట్, అది వెళ్లే గోడ మధ్యలో చిక్కుకుని నలిగిపోయింది. సహాయం కోసం టీచర్ గట్టిగా కేకలు వేసింది. కేకలు విన్న స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పరుగున వచ్చారు. ఆ ఉపాధ్యాయురాలిని రక్షించే ప్రయత్నం చేశారు. లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన టీచర్ ను బయటకు లాగారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.