మహారాష్ట్ర సీఎంతో తెలంగాణ సీఎం భేటీ
మిషన్ 2024 దిశగా తొలి అడుగు పడింది. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మహారాష్ట్ర ముఖ్యమంత్రి
మిషన్ 2024 దిశగా తొలి అడుగు పడింది. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తో ముంబైలో సమావేశమయ్యారు. భారతీయ జనతా పార్టీ ముక్త్ భారత్ నినాదం ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో సమావేశం అయ్యారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు.. NDA సర్కారుని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది.
ఉద్ధవ్ థాకరే నివాసంలోనే ఈ భేటీ జరిగింది. ఉద్ధవ్ కేసీఆర్ బృందానికి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఉద్ధవ్ ను కలిసేందుకు సీఎం కేసీఆర్ తో పాటు.. ఎమ్మెల్సీ కవిత, సినీ నటులు ప్రకాష్ రాజ్, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు మహారాష్ట్రకు వెళ్లారు.