కొందరికి నేను నచ్చక పోవచ్చు... అయినా?

అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం కాదని జాతి నిర్మాణమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు.

Update: 2023-01-26 02:30 GMT

అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం కాదని జాతి నిర్మాణమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. రాజ్‌భవన్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి చీఫ్ సెక్రటరీ, డీజీపీ హాజరయ్యారు. జెండా వందనం అనంతరం ఆమె జాతినుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణకు విశిష్టమైన చరిత్ర ఉందని గవర్నర్ అన్నారు. భవనాలు కట్టినంత మాత్రాన జాతి నిర్మాణం కాదన్నారు. నిజమైన అభివృద్ధి జాతి నిర్మాణం వల్లనే సాధ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ గవర్నర్ ప్రసంగం సాగింది. ఫామ్ హౌస్ లు కట్టడం అభివృద్ధి కాదన్నారు.

ఆందోళనకర పరిస్థితులు...
రాజ్యాంగం ప్రకారమే తెలంగాణా ఏర్పడిందని ఆమె అభిప్రాయపడ్డారు. తనకు, తెలంగాణతో ఉన్న అనుబంధం ఎవరూ విడదీయలేదని దన్నారు. రాష్ట్రాభివృద్ధికి రాజ్ భవన్ సహకరిస్తుందన్నారు. రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మస్థైర్యంతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదామని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో తన పాత్ర తప్పకుండా ఉంటుందని తెలిపారు. కొంతమందికి తాను నచ్చకపోవచ్చని అయినా తాను తెలంగాణ మరింత అభివృద్ధి కావాలని కోరుకుంటానని చెప్పారు. అనంతరం పలువురు ప్రముఖులకు ప్రశంసా పత్రాలను గవర్నర్ అందచేశారు.


Tags:    

Similar News