తెలుగు వ్యక్తిని ఎంపిక చేసిన భగవంత్ మాన్

పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టబోతున్న భగవంత్ మాన్ అధికార బృందంలో తెలుగు వ్యక్తి నియమితులయ్యారు.

Update: 2022-03-13 03:37 GMT

పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టబోతున్న భగవంత్ మాన్ అధికార బృందంలో తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి వేణుప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కీలక స్థానంలో తెలుగు వ్యక్తికి పంజాబ్ కు కాబోయే సీఎం ప్రాధాన్యత ఇచ్చారు.

తెలంగాణకు చెందిన....
వేణుప్రసాద్ 1991 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్న గ్రామానికి చెందిన వారు. పంజాబ్ క్యాడర్ లో పనిచేస్తున్న వేణుప్రసాద్ గతంలో అనేక జిల్లాల కలెక్టర్ గా పనిచేశారు. ప్రస్తుతం వేణుప్రసాద్ విద్యుత్తు శాఖ సీఎండీగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వేణుప్రసాద్ చదువంతా నాగార్జున సాగర్, బాపట్ల, రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సాగింది.


Tags:    

Similar News