బెంగాల్ అసెంబ్లీలో టెన్షన్.. ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ

బెంగాల్ అసెంబ్లీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ్యుల మధ్య ఘర్షణ జరిగింది

Update: 2022-03-28 07:35 GMT

బెంగాల్ అసెంబ్లీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడికి దిగారు. తోపులాట జరిగింది. మార్షల్స్ అడ్డుకుంటున్నా ఇరుపార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఘర్షణకు దిగారు. దీంతో స్పీకర్ బీజేపీకి చెందిన ఐదుగురు సభ్యులను సస్పెండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరుపార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు సర్ది చెప్పారు.

బీర్‌భూం ఘటనపై....
బెంగాల్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే బీర్‌భూం ఘటనపై చర్చ జరగాలని బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీనికి అధికార టీఎంసీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. స్పీకర్ నచ్చచెబుతున్నా విన్పించకోక పోవడంతో మార్షల్స్ రంగ ప్రవేశం చేశారు. బీజేపీ సభ్యులను సస్పెండ్ చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. బీర్ భూం ఘటనపై న్యాయస్థానం సూచన మేరకు ఇప్పటికే సీబీఐ దర్యాప్తు జరుగుతున్న సంగతి తెలిసిందే.


Tags:    

Similar News