ఉత్తర్‌ప్రదేశ్‌లో తొక్కిసలాట.. 27 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. తొక్కిసలాట జరిగి ఇరవై ఏడు మంది మరణించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. తొక్కిసలాట జరిగి ఇరవై ఏడు మంది మరణించారు. వందకు పైగా గాయాలయ్యాయి. భోల్ బాబా సత్సంగంలో ఈ భక్తుల మధ్య తొక్కిసలాట జరగడంతో ఈ ఘటన చోటు చచేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. తొక్కిసలాటలో మరణించిన వారిలో 23 మంది మహిళలున్నారు. ముగ్గురు చిన్నారులున్నారు. ఒక పురుషుడు ఉన్నారని అధికారులు తెలిపారు. రతీభాన్‌పూర్ లో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అయితే కార్యక్రమం ముగిసిన వెంటనే తొక్కిసలాట జరిగి వీరు మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మృతుల సంఖ్య...
గాయపడిన వారిని వెంటనే ఎటా మెడికల్ కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ అధికారులను ఆదేశించారు. తొక్కిసలాట జరగడానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.