Train Accident : తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొనడంతో?
తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి జరిగిన భాగమతి రైలు ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారు
తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి జరిగిన ీ రైలు ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారు. తమిళనాడు శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు రైళ్లు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఏసీ బోగీలు తగలబడ్డాయియ. మైనూరు నుంచి దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు తమిళనాడు శివారులో మరో గూడ్స్ రైలును వేగంగా ఢీకొట్టింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రైలు బోగీలు ఎగిరి పడటమే కాకుండా ఏసీ బోగీలు తగలపడ్డాయి. పదమూడు కోచ్‌ల వరకూ పట్టాలు తప్పాయి. ఇందులో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని...
గాయపడిన ప్రయాణికులు వందల సంఖ్యలో ఉండటంతో వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏసీ కోచ్‌లలో ఉండే ప్రయాణకులు ఎక్కువ మంది గాయపడినట్లు తెలిసింది. గాయపడిన వారిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వెంటనే రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలో భీతావహంగా పరిస్థితి మారింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడని ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చే ప్రక్రియను ప్రారంభించారు.
సిగ్నల్ ఇవ్వడంతో...
వారి కోసం ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసింది. భాగమతి ఎక్స్‌ప్రెస్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా వెళుతుండటంతో దసరా పండగ కోసం తెలుగు వారు కూడా ఉండే అవకాశముంది. దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లను ప్రకటించింది. 044 2535 4151, 044 2435 4995 ఫోన్లు చేసి తమ వారి వివరాలను తెలుసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు కవరైపెట్టై స్టేషన్ కు వస్తున్న సమయంలో మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్ లోకి వెళ్లింది. అదే సమయంలో ఎక్స్‌ప్రెస్ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలును భాగమతి ఎక్స్‌ప్రెస్ వేగంగా ఢీకొట్టిందని ప్రాధమికంగా నిర్ధారించారు. దీనిపై విచారణ జరుపుతున్నారు.