భారీగా పెరిగిన సిమెంట్ ధరలు
భవన నిర్మాణ పనులకు మరో షాక్ తగిలింది. సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి
భవన నిర్మాణ పనులకు మరో షాక్ తగిలింది. సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. ఈ నెల 1 నుంచి సిమెంట్ ధరలను పెంచుతూ అన్ని కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఒక్క సిమెంట్ బస్తాకు ఇరవై నుంచి యాభై రూపాయల వరకూ పెరిగినట్లు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో యాభై కేజీలున్న సిమెంట్ బస్తా ధర 310 రూపాయల నుంచి నాలుగు వందలు పలుకుతుంది.
మరింత భారం....
సిమెంట్ ధరలు పెరగడంతో భవన నిర్మాణ పనులు మరింత భారం అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఇసుక, స్టీల్ ధరలు పెరగడంతో భవన నిర్మాణ ఖర్చు పెరిగాయి. తాజాగా సిమెంట్ ధరలు పెరగడంతో మరింత ఖర్చు భరించాల్సి వస్తుందన్న ఆందోళన అధిక మవుతుంది. ఈ ప్రభావం ఇళ్ల అమ్మకాలపై చూపుతుందంటున్నారు.