మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనించాయి.
బంగారం ధరలు తగ్గాయని సంబరపడేలోపే వాటి ధరలు పెరుగుతుంటాయి. బంగారం ధరల పెరుగుదల ఆగడం లేదు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు పెరిగితే ఇబ్బంది పడేది పేద, మధ్య తరగతి ప్రజలే. భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారాన్ని పెళ్లిళ్లకు కొనుగోలు చేస్తుంటారు. అయితే పెరుగుతున్న బంగారం ధరలు మధ్యతరగతి ప్రజలను దూరం చేస్తున్నాయి. బంగారం ధరలు ఈ ఏడాది అత్యధికంగా పెరిగే అవకాశముందని కూడా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొనుగోళ్లు కొంత తగ్గుముఖం పట్టినా బంగారం ధరలు మాత్రం తగ్గడం లేదు.
వెండి కూడా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,450 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,220 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 69,500 రూపాయలకు చేరకోవడం గమనార్హం.