బంగారం ధరలు పెరగలేదు.. ఎందుకంటే?

నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధర కిలో పై రూ.100లు పెరిగింది

Update: 2023-03-27 02:45 GMT

బంగారం ధరలు పెరగడమే కాని తగ్గడం అరుదుగా జరుగుతుంటాయి. దానికున్న డిమాండ్ అలాంటిది. అంతర్జాతీయంగా బంగారానికి ఉన్న డిమాండ్ ను అనుసరించి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటుంటాయి. కేంద్ర బ్యాంకుల వద్వ బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి తగ్గుదల, ద్రవ్యోల్బణం, కేంద్రప్రభుత్వం బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ పెంచడం, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీజన్‌తో సంబంధం లేకుండా జరిగే బంగారం కొనుగోళ్లు దాదాపుగా మందగించాయి. అవసరమైన వారు తప్పించి పెట్టుబడి కోసం చూసే వారు కూడా బంగారం ధరలను చూసి కొంత వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది.

వెండి మాత్రం...
అయితే నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధర కిలో పై రూ.100లు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,850 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,840 రూపాయలుగా నమోదయి ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 76,000 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News