గోల్డ్ రేట్స్ వరసగా ఎందుకు తగ్గుతున్నాయంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి

Update: 2023-02-28 04:13 GMT

బంగారం అంటే అందరికీ మోజు. గోల్డ్ రేట్లు తగ్గడమంటే అందరికీ ఆనందమే. బంగారం ధరలు ఇటీవల కాలంలో అందరికీ అందుబాటులో లేకుండా పోయాయి. కేవలం కొందరికే బంగారం పరిమితమవుతుందన్న భయమూ కలిగింది. కానీ బంగారం ధరలు వరసగా తగ్గుతుండటం కూడా కొనుగోళ్లు భారీగా పడిపోవడానికి కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, కేంద్ర బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ పెంపు, బంగారం దిగుమతులను తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. కానీ బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా పది గ్రాముల బంగారంపై వెయ్యి రూపాయల వరకూ తగ్గడం కొనుగోళ్లు మందగించడమే కారణమని చెబుతున్నారు.

ధరలు ఇలా...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,350 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,020 రూపాయలకు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 69,000 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News