హమ్మయ్య బంగారం ధర..?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి
బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. ధరలు పెరగకపోయినా ఎంత ఆనంద పడి పోతారో, స్థిరంగా కొనసాగినా అంతే సంబరపడిపోతుంటారు. బంగారానికి ఉన్న డిమాండ్ అలాంటిది. బంగారం ప్రతి భారతీయుడి ఇంట ఒక వస్తువుగా మారడంతో దాని విలువతో పాటు డిమాండ్ కూడా పెరిగింది. పెరుగుతున్న డిమాండ్ ను అనుసరించి ధరలు కూడా పెరుగుతున్నాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం బంగారం పెరుగుదలకు కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగుమతులు తగ్గించడం కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు.
స్థిరంగా వెండి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. గత కొద్ది రోజుల నుంచి వరసగా బంగారం ధరలు పెరుగుతూ ఆందోళన కల్గిస్తున్న నేపథ్యంలో ధరలు స్థిరంగా కొనసాగడం పసిడి ప్రియులకు ఊరట కల్గించే అంశమే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,300 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,320 గా నమోదయి ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర 74,400 రూపాయలకు చేరుకుంది.