బంగారం ధరలకు బ్రేక్
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి
ఎందుకో మరి బంగారం ధరలు ఐదు రోజుల నుంచి పెరగడం లేదు. బంగారం ధర పెరగకపోతే చాలు కొనుగోలుదారులకు కొంత ఊరట నిచ్చే విషయమేనని చెప్పాలి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. త్వరగానే తులం బంగారం అరవై వేల రూపాయలకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. అయితే దానికి భిన్నంగా బంగారం ధరలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా బంగారం దిగుమతులను తగ్గించడంతో ధరలు మరింత పెరుగుతాయని భావించారు. అలాగే కేంద్ర బడ్జెట్ లో బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ కూడా పెంచడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతాయని అంచనా వేశారు. దీంతో బంగారం ధరలు భారంగా మారే అవకాశముందని మార్కెట్ నిపుణులు సయితం అంగీకరించారు.