ఆగని పెట్రో బాదుడు.. ఈరోజు ఎంతంటే?
ఈరోజు లీటరు పెట్రోలుపై 90 పైసలు, లీటరు డీజిల్ పై 87 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి
చమురు సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అధికారం ఉంది కదా అని ప్రజలపై పెట్రో బాదుడు ఆపడం లేదు. గత తొమ్మిది రోజులుగా చమురు సంస్థలు పెట్రోలు ధరలను పెంచుతూనే ఉన్నాయి. తాజాగా ఈరోజు లీటరు పెట్రోలుపై 90 పైసలు, లీటరు డీజిల్ పై 87 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అర్ధరాత్రి పెంపుదల నిర్ణయం తీసుకోవడం, తెల్లారేసరికి ధరలు పెరగడం గత తొమ్మిది రోజులుగా జరుగుతూనే ఉంది.
త్వరలో రూ.140 లకు....
పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర 115.42 రూపాయలకు చేరుకుంది. లీటరు డీజిల్ ధర 101.58 రూపాయలుగా ఉంది. పెట్రోలు లీటరు ధర 140 రూపాయలు దాటే అవకాశముందని చెబుతున్నారు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతోనే ముడి చమురు బ్యారెల్ ధర గరిష్ట స్థాయికి చేరుకోవడంతోనే పెంచక తప్పడం లేదని చమురు సంస్థలు సమర్థించుకుంటున్నాయి.