బంగ్లాదేశ్ పరిణామాలపై అఖిలపక్ష సమావేశం
ఈరోజు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుంది. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలను వివరించనున్నారు
ఈరోజు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుంది. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలను వివరించనున్నారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు, దాని ప్రభావం భారత్ పై పడే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్ కు వచ్చారు.
అక్కడ పరిణామాలను...
ఆమె భారత్ నుంచి లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే బ్రిటన్ ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో భారత్ లోనే హసీనా ఆశ్రయం పొందుతున్నారు. ఈ అఖిలపక్ష సమావేశంలో రాజ్‌నాధ్ సింగ్, అమిత్ షా, జై శంకర్ లు పాల్గొననున్నారు. మిత్ర దేశంగా ఉన్న బంగ్లాదేశ్ లో పరిస్థితులను విదేశాంగ మంత్రి జైశంకర్ వివరించనున్నారు.