కిలో టమాటాకు.. కేజీ బిర్యానీ ఫ్రీ.. బంపర్ ఆఫర్
గతంలో ఎన్నడూ లేని విధంగా కొద్ది రోజుల నుంచి టమాటాకు డిమాండ్ పెరిగింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా కొద్ది రోజుల నుంచి టమాటాకు డిమాండ్ పెరిగింది. ఐదు రూపాయలు కిలో అమ్మే టమోటా ధర నేడు వంద దాటింది. భారీ వర్షాల కారణంగా పంటనష్టం జరగడంతో టమాటా ధర అమాంతం పెరిగింది. తమిళనాడులో కిలో టమాటా ధర 150 రూపాయలు పలుకుతుంది. దీంతో తమిళనాడులోని ఒక రెస్టారెంట్ యజమాని గమ్మత్తయిన ఆఫర్ ను ప్రజలకు పెట్టారు.
అర కిలో ఫ్రీ....
కిలో టమాటా ఇస్తే కిలో బిర్యానీ ఫ్రీ అంటూ తన రెస్టారెంట్ ముందు బోర్డు పెట్టారు. చెన్నై నగరానికి దూరంగా ఉన్న అంబూర్ లో బిర్యానీ సెంటర్ నిర్వాహకుడు పెట్టిన ఈ బోర్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కిలో టమాటాకు, కేజీ బిర్యానీ ఫ్రీ అంటూ చేసిన ప్రకటన అందరినీ ఆకట్టుకుంటోంది. మరో బిర్యానీ హోటల్ నిర్వాహకుడు వందరూపాయల కేజీ బిర్యానీ అని, రెండు కేజీలు కొంటే అరకిలో టమాటా ఉచితమని ఆయన ప్రకటించాడు. ఇప్పుడు టామాటా ఉల్లిని మించిపోయింది.