ఈ ఆవు ఖరీదు నలభై కోట్లు.. ఎగరేసుకుపోయారు..ఏంటీ దీని స్పెషల్?

బ్రెజిల్ లో ఒక ఆవును నలభై కోట్ల రూపాయలకు వ్యాపారులు కొనుగోలు చేశారు

Update: 2024-03-27 08:16 GMT

ఒక ఆవు ఖరీదు లక్ష లేకుంటే పది లక్షలుంటుంది. కాకుంటే ఇంకా మేలుజాతి ఆవు అయితే కోటి రెండు కోట్లు పలుకుతుంది. కానీ బ్రెజిల్ లో ఒక ఆవును నలభై కోట్ల రూపాయలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. దీనిని నెల్లూరు జాతి ఆవు. నలభై కోట్ల రూపాయలకు అమ్ముడయి ఈ ఆవు రికార్డు సృష్టించింది. వయాటినా - 19 ఎఫ్ఐవీ మారా ఇమోవీస్ అనే ఆవు ఇంత పెద్దమొత్తంలో అమ్ముడు పోవడం ప్రపంచ రికార్డు అని చెబుతున్నారు.Full View

నెల్లూరు జాతి ఆవుకు...
నెల్లూరు జాతి ఆవుకు ప్రత్యేక లక్షణాలున్నాయి. ప్రత్యేక మైన, నాణ్యమైన జన్యు లక్షణాలున్నాయి. ఈ ఆవుకు రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉండగటంతో పాటు, చలిని, ఉష్ణోగ్రతలను తట్టుకునే శక్తి ఉండటం ఈజాతి ఆవుల ప్రత్యేకత అని చెబుతున్నారు. అందుకోసమే ఎగబడి వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. చివరకు ఒక వ్యాపారి నలభై కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నాడు.


Tags:    

Similar News