జల్లికట్టులో 60 మందికి గాయాలు
జల్లికట్టు ఆటలో విషాదం చోటు చేసుకుంది. దాదాపు అరవై మందికి పైగా గాయాలయ్యాయి. పది మంది పరిస్థితి విషమంగా ఉంది
జల్లికట్టు ఆటలో విషాదం చోటు చేసుకుంది. దాదాపు అరవై మందికి పైగా గాయాలయ్యాయి. పది మంది పరిస్థితి విషమంగా ఉంది. మదురై జిల్ాలోని అవనీయపురంలో జరిగిన జల్లికట్టు పోటీల్లో వేల సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా ఆడే ఆట కావడంతో వేలాది మంది ఇక్కడకు వచ్చి ఆటలో పాల్గొంటారు. వేల సంఖ్యలో వచ్చి ఈ ఆటను చూస్తుంటారు. ఇది తమిళనాడు సంస్కృతికి అద్దం పడుతుండటంతో ఈ ఆట తమిళనాడుకు ఒక ప్రత్యేకమని చెప్పాలి.
నిన్న జరిగిన పోటీల్లో...
జల్లికట్టు ఫైనల్స్ కోసం నిన్న జరిగిన పోటీల్లో పదిహేను వందల మంది పోలీసులు భద్రతగా ఉన్నారు. గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించేందుకు నలభై మెడికల్ క్యాంప్ లను ఏర్పాటు చేశారు. బెదిరిపోయిన ఎద్దులు యువకలు మీద పడటంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఎద్దులను లొంగదీసుకున్న వారికి బహుమతులను అందచేశారు. ఈ పోటీల్లో విజయ్ అనే యువకుడు ప్రధమ స్థానంలో నిలిచి కారును బహుమతిగా పొందాడు.