Breaking : గర్బా నృత్యం చేస్తూ పది మంది గుండెపోటుతో మృతి
గుజరాత్‌లో విషాదం చోటు చేసుకుంది. గర్బా నృత్యం చేస్తూ పది మంది వేర్వేరు చోట పది మంది మృతి చెందిన సంఘటన కలకలం రేపుతుంది
గుజరాత్‌లో విషాదం చోటు చేసుకుంది. గర్బా నృత్యం చేస్తూ పది మంది వేర్వేరు చోట పది మంది మృతి చెందిన సంఘటన కలకలం రేపుతుంది. దసరా నవరాత్రుల వేడుకల్లో గర్బా చేయడం సంప్రదాయంగా వస్తుంది. ఇటీవల చిన్న వయసున్న వారు కూడా గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు కలవరం రేపుతున్నాయి.
చిన్నారులు, యువకులు...
అయితే గుజరాత్‌లో ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో పది మంది మృతి చెందడంతో రాష్ట్రంలో దసరా వేడుకల్లో విషాదం నెలకొంది. మృతుల్లో చిన్నారుల నుంచి యువకులు కూడా ఉన్నారు. గర్బా నృత్యం చేస్తూ కుప్పకూలి పోయిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. నృత్యం చేస్తూ ఒక్కసారి కుప్పకూలి మరణిచండంతో విషాదం చోటు చేసుకుంది.