Sabarimala : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రావెన్ కోర్ దేవస్థానం
అయ్యప్ప భక్తులకు శబరిమలలోని ట్రావెన్ కోర్ దేవస్థానం శుభవార్త చెప్పింది
అయ్యప్ప భక్తులకు శబరిమలలోని ట్రావెన్ కోర్ దేవస్థానం శుభవార్త చెప్పింది. మాస పూజకు రోజుకు 50 వేల మంది భక్తులను వర్చువల్ క్యూ ద్వారా దర్శనానికి అనుమతించాలని శబరిమల ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది.
దర్శనం చేసుకునేందుకు...
క్యూ లైన్ ద్వారా దర్శనం చేసుకునే అయ్యప్ప భక్తులకు బీమా పాలసీని కూడా అందించనున్నామని అధికారులు తెలిపారు. ఇన్సూరెన్స్ పాలసీ కోసం బుకింగ్ సమయంలో భక్తుల నుండి కేవలం పది రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నామని వెల్లడించారు. మాసపూజకు అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.