గుజ‌రాత్ గొంతెండుతోంది.. ఇది ట్రబుల్ ఇంజన్ పాలన !

అహ్మదాబాద్ లో ప్రజలు మంచి నీళ్లు దొరక్క అలమటిస్తున్నారని, ఇది డబుల్ ఇంజన్ పాలన కాదని ట్రబుల్ ఇంజన్ పాలన

Update: 2022-05-10 06:08 GMT

హైదరాబాద్ : టీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య గ‌త కొంత కాలంగా ట్విట్ట‌ర్ వార్ జ‌రుగుతున్న విష‌యంతో తెలిసిందే. మొన్న రాహుల్ గాంధీ తెలంగాణకు వ‌స్తున్న స‌మ‌యంలో కాంగ్రెస్‌, టీఆర్ఎస్ ల ట్విట్ట‌ర్ లో ఒక చిన్న‌పాటి యుద్ధమే జ‌రిగింద‌ని చెప్ప‌వ‌చ్చు. టీఆర్ఎస్ విమ‌ర్శ‌లు వ‌ర్షం కురిపిస్తే, కాంగ్రెస్ సైతం అదేరీతిలో స్ట్రాంగ్ గానే బ‌దులిచ్చింది. ఇప్పుడు తాజాగా మోదీ స్వ‌రాష్ట్రంలోనే నీటి క‌ష్టాలు ఉన్నాయంటూ రాష్ట్ర ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ బీజేపీ పాల‌న‌పై మండిప‌డ్డారు. భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం నానా తంటాలు పడుతున్నారని తన ట్విట్టర్ లో ఓ ఫోటో షేర్ చేశారు.

అహ్మదాబాద్ లో ప్రజలు మంచి నీళ్లు దొరక్క అలమటిస్తున్నారని, ఇది డబుల్ ఇంజన్ పాలన కాదని ట్రబుల్ ఇంజన్ పాలన అని ట్వీట్ చేశారు. బీజేపీది డబుల్ ఇంజిన్ కాదు.. ట్రబుల్ ఇంజిన్ అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏం కావాలి? అంటూ ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. ఈ పోస్ట్ నెట్టింట్లో ఇప్పుడు వైర‌ల్ మారింది. ఇక స్వ‌రాష్ట్రంలోనే పాల‌న ఇలా ఉంటే దేశంలో ఇత‌ర రాష్ట్రాల్లో బీజేపీ పాల‌న ఏవిధంగా ఉందో అని, అక్క‌డ నీటి క‌ష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవ‌చ్చ‌ని బీజేపీ ప్రభుత్వంపై చాలా మంది నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్ర‌భుత్వం భ‌విష్య‌త్తు త‌రాల‌కు సైతం నీటి క‌ష్టాలు రాకుండా ముంద‌స్తుగానే భారీ ప్రాజెక్టుల‌కు, ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుట్టి ఇప్ప‌టికే పూర్తి చేసిన‌ట్లు బాల్క‌సుమాన్ ఈ ట్వీట్ ద్వారా చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లైంది. ఇక‌పోతే మీద బాల్క సుమ‌న్ చేసిన ట్వీట్ కు బీజేపీ రాష్ట్ర నేత‌లు స్పందిస్తారా? మౌనంగా ఉండి అంగీక‌రిస్తారా అనేది వేచిచూడాల్సిందే.


Tags:    

Similar News