Ugadi : నేడు ఘనంగా తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు

నేడు ఉగాది వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి

Update: 2024-04-09 02:10 GMT

నేడు ఉగాది వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. వసంత రుతువుతో ప్రారంభమయ్యే ఈ పండగను తొలి పండగగా అందరూ చేసుకుంటారు. దీనికి దేవుడు లేడు. ఆలయాలకు వెళ్లరు. ఇళ్లలోనే పూజలు చేసుకుని, ఉగాది పచ్చడి చేసుకుని తొలి ఏడాదిని శుభంగా అందరూ ప్రారంభించుకుంటారు. మిగిలిన పండగలకు భిన్నమైన పండగ ఇది. మిగిలన పండగలకు ఏదో దేవుళ్లకు మొక్కడం ఆనవాయితీ. కానీ ఉగాది నాడు దేవుళ్ల తలచుకోరు. తయారు చేసుకునే పచ్చడిని ప్రసాదంలా స్వీకరించినా కళ్లకు అద్దుకోరు. అదే ఉగాది ప్రత్యేకత.

ఏడాదంతా శుభంగా...
ఈ కాలమానం చంద్రుడు నక్షత్రాల్లో సంచరించే గమనాన్ని ఆధారంా ఏర్పరచినది అంటారు. ఉగాదిని యుగాది అని కూడా అంటారు. చైత్ర మాసంలో వచ్చే పండగ రోజు శుభంగా ఉంటే ఇక ఏడాదంతా శుభసూచకంగా ఉంటుందని భావిస్తారు. అందుకే ఉగాది రోజుకు అదొక ప్రత్యేకత. ప్రత్యేకంగా పిండివంటలు తయారు చేసుకోవడం కూడా ఈ పండగ రోజు ఉండదు. తమకు ప్రియమైన వంటలను చేసుకుని భుజించడమే ఈ పండగ విశిష్టతగా పెద్దలు చెబుతారు. అన్ని పార్టీల కార్యాలయాల్లో ఉగాది వేడుకలను నిర్వహిస్తున్నారు.


Tags:    

Similar News