పద్మ అవార్డులు వీరికే

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రబుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. నలుగురికి పద్మవిభూషణ్ ను ఎంపిక చేశారు.

Update: 2022-01-26 02:16 GMT

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రబుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. నలుగురికి పద్మవిభూషణ్ ను ఎంపిక చేశారు. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్, మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్, రాధేశ్యామ్ ఖేమ్కా, ప్రభా ఆత్రేలకు పద్మవిభభూషణ్ లను ఇచ్చింది. అలాగే సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కు పద్మభూషణ్, మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టా చార్యకు పద్మభూషణ్ లను ఇచ్చి సత్కరించనుంది.

పదిహేడు మందికి....
మొత్తం పదిహేడు మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్యనాదెళ్ల, గూగూల్ సీఈవో సుందర్ పిచాయ్ లకు కూడా పద్మభూషణ్ లను ఇచ్చింది. అలాగే భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు కృష్ణ లీలా, అతని భార్యకు కూడా పద్మభూషణ్ ను ఇచ్చింది. మాజీ హోం సెక్రటరీ రాజీవ్ మెహ్రిషి, నీరజ్ చోప్రాలకు కూడా పద్మభూషణ్ ను ఇచ్చింది.
ఏపీ, తెలంగాణ నుంచి....
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఏపీ నుంచి గరికపాటి నరసింహారావు, సుంకర వెంకట ఆదినారాయణ, షేక్ హసన్, తెలంగాణ నుంచి పద్మజారెడ్డి, మొడిలయ్య, రామచంద్రయ్యలకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. షావుకారు జానకి కూడా తమిళనాడు నుంచి పద్మశ్రీ అందుకునే వారిలో ఒకరిగా ఉన్నారు.


Tags:    

Similar News