అమిత్ షా విమానం అత్యవసర ల్యాండింగ్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

Update: 2023-01-05 02:39 GMT

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దారి మళ్లించి ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి అగర్తలా వెళుతున్న ప్రతికూల వాతావరణం కారణంగా అమిత్ షా ప్రయాణిస్తున్న విమానాన్ని అత్యవసరంగా గౌహతిలో ల్యాండ్ చేశారు.ఈరోజు త్రిపురలో పర్యటించాల్సి ఉంది. రధయాత్రను ఆయన ప్రారంభించాల్సి ఉంది.

వాతావరణం అనుకూలించక...
అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో గౌహతిలో ల్యాండ్ అయింది. గౌహతిలోని గోపినాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయడంతో తొలుత కొంత పార్టీ నేతల్లో అలజడి రేగింది. తర్వాత విషయం తెలుసుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి అగర్తలా చేరుకోవాల్సి ఉండగా ఆయన రాకపోవడంతో అక్కడి నేతలు కూడా కొంత ఆందోళన చెందారు. రాత్రి అక్కడే అమిత్ షా బస చేశారు.


Tags:    

Similar News