సీఎం పదవికి యోగి రాజీనామా
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ తన పదవికి రాజీనామా చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ తన పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు. శాసనసభను రద్దు చేయాల్సిందిగా యోగి ఆదిత్యానాధ్ గవర్నర్ ను కోరారు. త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ యోగిని కోరారు.
కొత్త ప్రభుత్వం....
ఉత్తర్ ప్రదేశ్ లో శాసనసభ పక్ష నేత ఎన్నిక కావాల్సి ఉంది. బీజేపీ అగ్రనాయకత్వం సమావేశమై కొత్త నాయకత్వంపై స్పష్టత ఇస్తుంది. యోగి ఆదిత్యానాధ్ ను మరోసారి సీఎంగా కొనసాగించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే యోగి ఆదిత్యానాధ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.