మళ్లీ మాస్క్‌లు తప్పనిసరి
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నోయిడా ఆరోగ్యశాఖ ఈ సూచనలు చేసింది
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నోయిడా ఆరోగ్యశాఖ ఈ సూచనలు చేసింది. తిరిగి మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, శానిటైజర్లు వాడాలని కోరింది. కరోనా కేసులు రోజుకు పదివేల కేసులు నమోదవుతుండటంతో వెంటనే ప్రభుత్వం చర్యలకు దిగింది. ఇక స్కూళ్లు, కళాశాలలు, షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, బహిరంగ ప్రదేశాల్లో ఖచ్చితంగా మాస్క్‌లు ధరించాలని నిర్ణయించింది.
వర్క్ ఫ్రం హోం..
ఇక ఉద్యోగులకు స్వల్ప లక్షణాలు కనిపిస్తే వెంటనే వర్క్ ఫ్రం హోంకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. దగ్గు, ఫ్లూ, జ్వరం వంటి కేసులు పెరుగుతుననాయి. అలాగే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ట్రీట్, ట్రేస్, టెస్టింగ్ వంటివి చేపట్టాలని ఉత్తర్‌ప్రదేశ్ ఆరోగ్య శాఖ కోరింది. ప్రజలు కూడా సహకరించాలని కోరింది.