చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. ఎప్పటినుంచి అంటే?
ఏప్రిల్ 22వ తేదీ నుంచి చార్ ధామ్ యాత్రను ప్రారంభించనున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పేర్కొంది.
శివరాత్రి సందర్భంగా చార్ ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 22వ తేదీ నుంచి చార్ ధామ్ యాత్రను ప్రారంభించనున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పేర్కొంది. శీతాకాలం కావడం, మంచుకురుస్తుండటంతో ఆరు నెలల పాటు కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను మూసివేశారు. ఈ ఏప్రిల్ 22వ తేదీ నుంచి తిరిగి తెరవనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అన్ని ఏర్పాట్లు....
కేదారనాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 25 ఉదయం 6.20 గంటలకు తెరుస్తామని పేర్కొంది. అలాగే బద్రీనాధ్ ఆలయాన్ని ఏప్రిల్ 27వ తేదీన తెరవనున్నట్లు ప్రకటించింది. అయితే ఇటీవల భూమి కుంగిపోయిన జోషిమఠ్ ప్రభావం చార్ థామ్ యాత్రపై కనిపించదని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ అన్నారు. యాత్రకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. గత ఏడాది 45 లక్షలమంది వచ్చారని, ఈ ఏడాది అంతకు మించి భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని తెలిపారు.