అన్నీ మండిపోతున్నాయ్.. ధరలు ఆకాశంలోకి

మార్కెట్ లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నిత్యావసరాల వస్తువులు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది.;

Update: 2021-12-08 07:11 GMT

మార్కెట్ లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నిత్యావసరాల వస్తువులు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రభుత్వ నియంత్రణ కొరవడటంతో ఉప్పు, పప్పు, బియ్యంతో పాటు కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి. ఉల్లి ధర దిగి రావడం లేదు. ఇప్పటికి కిలో నలబై రూపాయాలు పలుకుతుంది. ఇక ఆయిల్ ధరలు కూడా అలాగే ఉన్నాయి. ఇది సామాన్యులకు భారంగా మారుతుంది.

ఏం కొనేటట్లు లేవు...
మరోవైపు కూరగాయల ధరలు కొనేటట్లు లేవు. టమాటా ఇప్పటికీ కిలో డెబ్భయి రూపాయల వరకూ ఉంది. ఆలుగడ్డ, బెండకాయ, దొండకాయ, వంకాయ ఏ కూర అయినా కిలో ఎనభై రూపాయల వరకూ ఉంది. గతంలో కిలో నలభై రూపాయలున్న వంకాయ ఇప్పుడు వందకు చేరుకుంది. ఇక ఆకుకూరల ధరలు చెప్పలేని పరిస్థిితి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసమస్యలను పట్టించుకోవడం మానేసి చాలా రోజులయింది. పెరిగిన వస్తువులు దిగిరావడం లేదు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


Tags:    

Similar News