తీవ్ర తుపానుగా బిపర్ జోయ్.. ఐఎండీ హెచ్చరిక
అత్యంత తీవ్రతుపానుగా ఉన్న బిపర్ జోయ్ రానున్న మూడు రోజుల్లో ఉత్తరదిశగా కదులుతుందని వాతావరణశాఖ తెలిపింది. అయితే..
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ 4వ తేదీకి రుతుపవనాలు కేరళను తాకాల్సి ఉంది. కానీ.. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జోయ్ అనే తుపాను కారణంగా రుతుపవనాల రాక ఆలస్యమైంది. ఫలితంగా జూన్ లోనూ దేశంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఈ తుపాను తీవ్రత ఎక్కువగా ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. తుపాన్ ప్రభావంతో కేరళలోకి రేపు రుతుపవనాలు ప్రవేశించవచ్చని అంచనా వేసింది.
అత్యంత తీవ్రతుపానుగా ఉన్న బిపర్ జోయ్ రానున్న మూడు రోజుల్లో ఉత్తరదిశగా కదులుతుందని వాతావరణశాఖ తెలిపింది. అయితే.. అరేబియా సముద్రాన్ని ఆనుకుని ఉన్న దేశాలతో పాటు.. భారతదేశం, ఒమన్, ఇరాన్, పాకిస్థాన్ లపై ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. జూన్ 12 వరకూ తుపాన్ తీవ్రత కొనసాగుతుందని చెబుతున్నారు. వాతావరణంలో జరుగుతున్న మార్పుల కారణంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపాన్లు బలపడుతున్నాయని తెలిపారు. తుపాను, అల్పపీడనంల ప్రభావంతో దక్షిణ ద్వీపకల్పంలో వర్షాలు కురుస్తాయని సీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడించారు. తుపాను తీవ్రత క్షీణించిన అనంతరం ద్వీపకల్పాన్ని దాటి రుతుపవనాలు వేగం పుంజుకుంటాయని తెలిపారు.