ఆవుకి ఘనంగా సీమంతం.. 24 రకాల వంటకాలతో విందు

తాజాగా ఓ కుటుంబం వైభవంగా గోమాతకు సీమంతం ఫంక్షన్ చేశారు. ఇలాంటి అపురూప దృశ్యం తమిళనాడులోని ఓ గ్రామంలో కనిపించింది.

Update: 2023-02-09 07:12 GMT

cow baby shower

ఆవుని హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. సొంతింటి బిడ్డలా భావించి పెంచుకుంటారు. ఆవులు, కుక్కలు వంటి వాటిని తమ ఇంటి పిల్లలుగా చూసుకుంటూ.. వాటికి పుట్టిన రోజులు, సీమంతాలు చేస్తుంటారు. తాజాగా ఓ కుటుంబం వైభవంగా గోమాతకు సీమంతం ఫంక్షన్ చేశారు. ఇలాంటి అపురూప దృశ్యం తమిళనాడులోని ఓ గ్రామంలో కనిపించింది. కల్లకురిచ్చి జిల్లా శంకరాపురం గ్రామంలో గర్భిణిగా ఉన్న ఆవుకు సాంప్రదాయం సీమంతం వేడుక చేశారు.

ఈ వేడుకకు దాదాపు 500 మంది అతిథులు హాజరవ్వగా.. 24 రకాల వంటకాలను వడ్డించారు. తమిళనాడులోని మేలపట్టు గ్రామంలో ఉన్న ఆరుతరమ్ తిరుపురసుందరి అమ్మై ఆలయ ట్రస్ట్ ఈ ఆవును సంరక్షిస్తుంది. ఈ ఆవు పేరు అంశవేణి. సీమంతం సందర్భంగా ఆవుని పువ్వులు, గంటలతో చూడచక్కగా అలంకరించారు. సీమంతం చేసుకున్న ఆవుకు అనేక రకాల గిప్టులు కూడా అందాయి. మహిళలు ధరించే కంకణాలతో సహా 48 రకాల కానుకలు వచ్చాయి. సీమంతం పూర్తయ్యాక మహిళలంతా ఆవు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.


Tags:    

Similar News