స్కూల్స్ కు సెలవు.. భారీ వర్ష సూచన

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ భారీ వర్షసూచన జారీ చేసింది. రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా

Update: 2023-07-10 03:08 GMT

ఉత్తరాదిన భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలో గత 41 ఏళ్లలో లేనంతగా రికార్డుస్థాయిలో భారీ వర్షం కురిసింది. ఢిల్లీతోపాటు గురుగ్రామ్‌తో సహా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వర్షాల ఎఫ్టెక్ట్‌తో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్, గురుగ్రామ్‌లో సోమవారం స్కూల్స్ కు సెలవు ప్రకటించారు. యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో పాటు కన్వర్ యాత్రను దృష్టిలో ఉంచుకుని జూలై 15 వరకు స్కూల్స్‌కు సెలవులు ఇచ్చారు.

గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో వరదలు ఎక్కువయ్యాయి. బలమైన ఈదురుగాలులు, కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలతో ఉత్తరాది రాష్ట్రాల్లో మృతుల సంఖ్య 22కి పెరిగింది. అధికారిక లెక్కల ప్రకారం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్ లో 17 మంది మరణించగా, యూపీ, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 5 మరణాలు నమోదయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ లోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటివరకు పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడిన ఘటనలు 14 నమోదు కాగా, 13 ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభివించాయి. రాష్ట్రంలో 700 చోట్ల రోడ్లు మూసుకుపోయాయి.
ఇక తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ భారీ వర్షసూచన జారీ చేసింది. రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. ఈ మేరకు పలు జల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. నేడు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 13,14వ తేదీలలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, మహబూబాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది.


Tags:    

Similar News