ఎవరీ ప్రజ్ఞానంద ? అతని నేపథ్యం ఏమిటి ? ఎందుకు వార్తల్లో నిలిచాడు ?

ప్రజ్ఞానంద తండ్రి ఓ బ్యాంక్ మేనేజర్. తల్లి గృహిణి. అతని పూర్వీకులు చెస్ ఆటగాళ్లు. వారి నుంచి స్ఫూర్తి పొందిన ప్రజ్ఞానంద, చెస్ ఆడడం మొదలుపెట్టారు.

Update: 2023-08-27 08:09 GMT

ఎవరీ ప్రజ్ఞానంద ? అతని నేపథ్యం ఏమిటి ?

ఎందుకు వార్తల్లో నిలిచాడు ?

ప్రజ్ఞానంద తండ్రి ఓ బ్యాంక్ మేనేజర్. తల్లి గృహిణి. అతని పూర్వీకులు చెస్ ఆటగాళ్లు. వారి నుంచి స్ఫూర్తి పొందిన ప్రజ్ఞానంద, చెస్ ఆడడం మొదలుపెట్టారు. ఇప్పుడు పలుదేశాల్లో జరుగుతున్న టోర్నమెంట్‌లలో పాల్గొనేందుకు ప్రజ్ఞానంద వెళుతున్నారు. అతని తల్లి ఎప్పుడూ వెంట ఉంటారు. పదేళ్ల వయస్సుకే ప్రపంచ యువ అంతర్జాతీయ మాస్టర్ గా నిలిచాడు.

ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకు ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సెన్ చేతిలో ఓటమి చెంది, భారత గ్రాండ్‌మాస్టర్ రన్నరప్ టైటిల్‌‌‌తో ప్రజ్ఞానంద సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే అతని ఆటతీరు మాత్రం హేమాహేమీలను సైతం ఆశ్చర్య పరిచింది. ప్రజ్ఞానంద అద్భుతమైన ప్రతిభ, ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వడాన్ని ప్రశంసిస్తూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్స్(ట్విటర్‌) ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు

ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో వరల్డ్ టాప్ ర్యాంకర్ కార్ల్‌సెన్‌కు పోటీ ఇవ్వడం భారత్‌లో భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపుతుందని చెస్ చాంపియన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రజ్ఞానంద ఆట కోసం అతని తల్లిదండ్రులు అప్పులు చేసేవారు. 2016 వరకూ అదే పరిస్థితి. పదేళ్ల వయస్సులో ప్రపంచ యువ అంతర్జాతీయ మాస్టర్ గా నిలిచిన తర్వాతే ఆయనకు స్పాన్సర్‌షిప్ లభించింది. ఆయన సోదరి కూడా చెస్ ఆడతారు. ప్రస్తుతం ప్రజ్ఞానంద ఓడిపోయి ఉండొచ్చు. కానీ, భారత్ విజయ పరంపర ఇప్పుడే ప్రారంభమైందని కూడా అనుకోవచ్చు అని స్పోర్ట్ కాలమిస్టులు రాశారు. అందుకే అతను వార్తల్లో నిలిచాడు.

Tags:    

Similar News