నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. అధికార, విపక్షాలు సమావేశాలకు సిద్ధమయ్యాయి
పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. అధికార, విపక్షాలు సమావేశాలకు సిద్ధమయ్యాయి. తాము చేసిన అభివృద్ధి పనులను చెప్పుకునేందుకు అధికార పక్షం, దేశంలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. ప్రధానంగా నిరుద్యోగం, చైనాతో సరిహద్దు వివాదం, పెరిగిన ధరలు వంటివి ప్రధాన అంశాలుగా చర్చించాలసిన విపక్షాలు పట్టుబడుతున్నాయి.
వాడివేడిగా...
ఈరోజు ప్రారంభమయ్యే సమావేశాలు ఈ నెల 29వ తేదీ వరకూ జరగనున్నాయి. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుండటంతో దానిని కూడా అస్త్రాలుగా మలచుకునేందుకు ఇరు పక్షాలు ప్రయత్నాలు చేస్తాయి. మొత్తం 16 బిల్లులను ఈ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. బిల్లులను ఆమోదించుకునేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తుంది. దానిపై చర్చించేందుకు విపక్షం పట్టుబడుతుంది. దీంతో శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి.